ఎందుకొచ్చావ్...
ఎందుకెళ్ళిపోయావ్...
తీరానికి అల వచ్చిపోయినట్లు
తెరపైకి అలా వచ్చి, పోయావేం?
నిన్ను చూసిన తనివి తీరనే లేదు
నిన్నింకా చూడాలన్న ఆర్తి ఆరనే లేదు
అందమైన కల మొదత్లోనే చెదిరిపోయినట్లు
అదృశ్యమైపోయావేం?
చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి, గుండెలు
చెమ్మగిల్లేలా చేసావేం?
అయినా నువ్వు మాకు నచ్చావ్...నచ్చావ్....
నమస్తే అండి, నా మనసులో ప్రేమ ఉంది. స్నేహం ఉంది. అంబరాన్ని తాకే ఆలోచనలున్నాయి. సముద్రాన్ని ఆవిరి చేసే ఆవేశం ఉంది. కొంత ఫ్రస్ట్రేషన్...మరి కొంత సెన్సేషన్... ఒక్క ముక్కలో చెప్పాలంటే నా గొడవ! అదంతా మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను. ఈ ప్రయత్నంలో మీ సూచనలు, సలహాలు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను..... ................................... భరత్ రుషి
Sunday, 7 June 2015
Thursday, 4 June 2015
Sreemantudu Story (not Official) శ్రీమంతుడి కథ - ఒక అంచనా
హర్ష (మహేష్ బాబు)కి లెక్క లేనంత ఆస్తి ఉంటుంది. అతనికి లేనిది లేదని అంతా అతని గురించి అనుకుంటారు. కాని అతనికి ఇంకేదో కావాలి అనిపిస్తుంటుంది. అదేంటో తెలుసుకోవడం కోసం అతను అన్వేషిస్తుంటాడు. ఆ అన్వేషణలో భాగంగా తన పూర్వీకులు పుట్టి, పెరిగిన ఊరిని దత్తత తీసుకుంటాడు.
ఆ ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీర్చి, బాగుచేయాలనుకుంటాడు.కానీ అతనికి అడుగడుగునా ఒక విలన్ అడ్డుపడుతుంటాడు. అతని బారి నుండి ఊరిని ఎలా కాపాడాడు? అసలు అతనికీ, ఆ ఊరికీ సంబంధం ఏంటి? అతని దబ్బుతో అతను పొందలేనిది? ఆ ఊర్లో పొందగలిగింది ఏంటి? అనేది మిగతా కథ.
నా అంచనా ప్రకారం కుటుంబ సంబంధాలు, మన సంప్రదాయాల గురించిన సినిమా. ఉద్వేగాలు, అనుభూతులూ, హాస్యం, భీబత్సం....ఇలా అన్ని రసాలూ మేళవించిన మంచి సినిమా అవుతుందనిపిస్తోంది. మిర్చి దర్శకుడైన కొరటాల శివ పై నమ్మకం పెట్టొచ్చు. మీరేమంటారు.....?
Tuesday, 2 June 2015
Baahubali Story.....(Guess..not Official) బాహుబలి కథ ఇదిగో...(ఒక ఊహ)


Subscribe to:
Posts (Atom)