koodali

Sunday 13 July 2014

వర్మా.. ఇదేం ఖర్మ!!! Ice Cream Review

జనాలని భయపెట్టాలని తెగ ఇదిగా ప్రయత్నిస్తూ ఎప్పుడూ విఫలమయ్యే రాం గోపాల్ వర్మ
ఈ సారి ఐస్ క్రీం తో మరోసారి ఓడిపోయారు.
కథ విషయానికొస్తే ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అనే అమ్మాయి, ఆమె ప్రియుడు
ఎదుర్కొన్న అనుభవాలు, జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం.
చిత్రం అంతా హీరోయిన్ తేజస్వి నడుము కింద చూపించడానికీ, ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ని చూపించటానికీ సరిపోయింది.
పైగా చిత్రంలో హీరోయిన్ చేసిందల్లా ఇంట్లో గ్రౌంద్ ఫ్లోర్ నుండి పై ఫ్లోర్ కి వెల్లడం, ఐస్ క్రీం తినడం, బట్టలు మార్చుకొవడం, పదుకొవడం, చదువుతున్నట్టూ పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం - అంతే.
ఎవరో తలుపు దబా దబా బాదటం, తలుపు తీస్తే ఎవరూ ఉండకపొవటం,
వాటర్ టాప్ లో నుండి నీళ్ళు పడటం, కిర్రుమని తెరుచుకునే తలుపులు, గాలి సుడుల శబ్దాలు,
మరి కొన్ని విచిత్రమైన్ ధ్వనులతో, అర్థం లేని కేమరా యాంగిల్స్ తో  భయాన్ని స్రుష్తించాలని చూసారు వర్మ.
కాని అదంతా వృథా ప్రయాసే ఐంది. 
చూసిన సీన్లే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవటం, ఇంట్రెస్టింగ్ అంశం ఏదీ లేకపోవటం
వల్ల మొదలైన 15 నిమిషాలలోనే సినిమా బోర్ కొట్టిస్తుంది.
సినిమా మొత్తంలో ప్రధాన పాత్రలు రెండు కాక మధ్యలో ముసలి దెయ్యం, పని మనిషి, ఆమె తమ్ముడు, ప్లంబర్, పిజ్జా బాయ్ వచ్చి పోతుంటారు.
ఏ పాత్ర ఐనా విచిత్రం గా ప్రవర్తిస్తుంది. దానికి కారనం ఎం ఉందదు. కేవలం ప్రేక్షకుడిని  కన్ ఫ్యూస్  చేసి, భయపెట్టే ప్రయత్నంగానే కనిపిస్తుంది.
చూస్తున్నంత సేపూ ఎందుకీ సినిమా తీసాడని వర్మనీ, ఎందుకు వచ్చామని మనల్ని మనం తిట్టుకోవడానికి తప్ప ఏ రకంగ ఈ సినిమాని చూడలేం.