koodali

Friday 5 September 2014

అమ్మ

ఒంటి మీదికి ఇరవయ్యేళ్ళు వచ్చాయి కాని వీలున్నప్పుడల్లా అన్నం తినిపించమని అమ్మను అడుగుతాను. ఇంత పెద్దవాడివైనా అన్నం తినిపించమంటావేరా అని మురిపెంగా విసుక్కుంటుంది అమ్మ. ఎంతైనా అమ్మ చేతి ముద్ద రుచే వేరు. నా చేత్తో నేను తింటే రాని రుచి అమ్మ తినిపిస్తే ఎలా వచ్చింది? అంతా చేతి మహత్యం. ఆ మహత్యాన్ని ఆస్వాదించాలనే అమ్మను తినిపించమంటా. దేనికైనా రాసి ఉండాలి.

నేను ఎప్పుడూ మా అమ్మని అడుగుతుంటాను...ఇంత రుచిగా వంట ఎలా చేస్తావని. నవ్వుతుందే కాని జవాబు చెప్పదు అమ్మ.
'చిరునవ్వుతో' సినిమాలో తమ హోటల్లో కుక్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చిన వేణుని బ్రహ్మానందం ఒక ప్రశ్న అడుగుతాడు.
"ప్రపంచంలో బెస్ట్ కుక్ ఎవరు?" అని.

దానికి  వేణు "అమ్మ" అని సమాధానం చెప్తాడు.
"ప్రపంచంలో ఎవరైనా మొదట అమ్మ చేతి ముద్దే తింటారు. ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో అయినా అమ్మ చేసినంత రుచిగా ఎవరూ చేయలేరు"
అదే అమ్మ అంటే................ !

No comments:

Post a Comment